వ్యక్తిగత జీవితంపై పుకార్లకు బాధపడను: శోభిత ధూళిపాళ్ల
- వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఇష్టం లేదన్న శోభిత
- తన నటనపై మాట్లాడొచ్చని వెల్లడి
- తనను అర్థం చేసుకునే వాడు భర్తగా కావాలన్న నటి
‘‘నేను ఇది చెప్పకపోతే దీనిపై ప్రజలు తెలుసుకోవడానికి అవకాశమే ఉండదు. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ప్రతి దశలోనూ ఎంతో కష్టపడ్డాను. మీరు నన్ను చూడాలనుకుంటే, లేదా నా గురించి తెలుసుకోవాలంటే నా ప్రతిభను చూడాలని కోరతాను. నా శ్రమను చూడాలని కోరతాను. అది నాకు ఎంతో అమూల్యమైనది. అంతే కానీ, వారు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం ఏమిటి?’’ అని శోభిత చెప్పింది.
తన నటన గురించి మాట్లాడాలే కానీ, తన వ్యక్తిగత జీవితంలోకి చూడొద్దని శోభిత ఒక విధంగా అభిమానులను కోరినట్టయింది. ఎలాంటి జీవిత భాగస్వామి కావాలన్న ప్రశ్నకు.. ఒదిగి ఉండే వాడు తనకు కావాలంది. తనకు నన్నిహితంగా ఉంటూ, అర్థం చేసుకునేవాడు కావాలని తెలిపింది.