కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు 5 డిమాండ్లు పెట్టిన రెజ్లర్లు.. అవి ఏంటంటే..!
- అనురాగ్ ఠాకూర్ తో ముగిసిన రెజ్లర్ల భేటీ
- చర్చలకు హాజరైన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్
- బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్
అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు ఉంచిన ఐదు డిమాండ్లు ఇవే:
- ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ కు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.
- ఫెడరేషన్ చీఫ్ గా మహిళను నియమించాలి.
- రెజ్లింగ్ ఫెడరేషన్ లో బ్రిజ్ భూషణ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఉండకూడదు.
- కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం నాడు తమపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
- మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలి.
మరోవైపు తన గ్రామంలో ఒక కార్యక్రమానికి వెళ్లిన కారణంగా అనురాగ్ తో భేటీకి మరో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హాజరుకాలేదు.