చట్టాన్ని తన పని తనని చేయనివ్వండి.. రెజ్లర్లతో అమిత్ షా
- శనివారం అర్ధరాత్రి గంటకు పైగా సమావేశం
- బ్రిజ్ భూషణ్ పై వేగంగా చర్యలు తీసుకోవాలన్న రెజ్లర్లు
- చట్టం అందరికీ సమానమేనని తేల్చిచెప్పిన హోంమంత్రి
- బజ్ రంగ్ పూనియా, సాక్షి మాలిక్, సంగీతా ఫొగాట్ హాజరు
అనధికారిక సమాచారం మేరకు.. రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై నిష్పక్షపాత విచారణ జరిపించాలని, లైంగిక వేధింపుల కేసులో వేగంగా చర్యలు తీసుకోవాలని ఈ భేటీలో కేంద్ర హోంమంత్రిని రెజ్లర్లు కోరారు. పలు జాతీయ మీడియాలలో ఈమేరకు కథనాలు ప్రసారమయ్యాయి. చట్టం అందరికీ సమానమేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. చట్టం తన పని తాను చేసుకుపోనివ్వాలని అమిత్ షా రెజ్లర్లకు సూచించినట్లు సమాచారం.