'నేను స్టూడెంట్ సర్' నుంచి హుషారైన బీట్!
- బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
- యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా 'అవంతిక' పరిచయం
- జూన్ 2వ తేదీన సినిమా రిలీజ్
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి విష్వక్సేన్ చేతుల మీదుగా ఒక పాటను విడుదల చేశారు. '24/7 ఒకటే ధ్యాస .. గుండెలోపలే ఉందొక ఆశా' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా, బెన్నీ - మహతి స్వరసాగర్ ఆలపించారు.
ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా, బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు 'అవంతిక' కనిపించనుంది. ఈ సినిమాతోనే కథానాయికగా ఆమె ఇక్కడ పరిచయం కానుంది. ఆమె ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జూన్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.