ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తులు ఉంటాయి: టీజీ వెంకటేశ్
- ఏపీలో చర్చనీయాంశంగా మారిన పొత్తులు
- వైసీపీని గద్దె దించడమే తమ అజెండా అన్న టీజీ
- పవన్ తమతోనే ఉంటారని భావిస్తున్నామని వెల్లడి
ఇక, వైసీపీ, బీజేపీ ఒకటేనన్న ప్రచారంపైనా ఆయన వివరణ ఇచ్చారు. కేంద్రం మద్దతు ఇచ్చింది ఏపీ ప్రభుత్వానికి మాత్రమేనని, వైసీపీకి కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చిందని, దాన్ని అంతవరకే చూడాలని అన్నారు. బీజేపీ... ఏపీలో వైసీపీకి మద్దతు ఇస్తోందన్న తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు.