నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల
- తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు
- సోషల్ మీడియాలో పలు రకాలుగా ప్రచారం
- తాజా బులెటిన్ లో వివరాలు తెలిపిన ఏఐజీ ఆసుపత్రి
- శరత్ బాబు ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని వెల్లడి
- ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వివరణ
శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని వెల్లడించింది. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ, వెంటిలేటర్ పైనే ఉన్నారని వివరించింది. ఎవరూ కూడా ఊహాగానాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐజీ ఆసుపత్రి ఓ బులెటిన్ విడుదల చేసింది. ఆసుపత్రి వర్గాలు కానీ, శరత్ బాబు కుటుంబ సభ్యులు కానీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తుంటారని ఆ బులెటిన్ లో పేర్కొంది.