మైదానంలో ముంబైని గెలిపించి.. బయట చిన్నారుల మనసులు గెలిచిన సూర్యకుమార్
- రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ముంబై ఉత్కంఠ విజయం
- అర్ధ సెంచరీతో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్
- తింటున్న ప్లేట్ పక్కనబెట్టి చిన్నారులతో ఫొటోలు దిగిన ముంబై బ్యాటర్
ఆట ముగిసిన తర్వాత వాంఖడే స్టేడియం బయట జట్టు బస్సు ఎక్కేముందు స్నాక్స్ తింటున్న సూర్యను చూసి కొంత మంది చిన్నారి అభిమానులు ముందుకొచ్చారు. భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇది చూసిన సూర్య వారిని తన వద్దకు రమ్మన్నాడు. తింటున్న ప్లేట్ పక్కనబెట్టి చిన్నారులతో సెల్ఫీలు ఇచ్చాడు. ఓపిగ్గా వారి ఫోన్లలో తానే ఫొటోలు తీశాడు. అడిగిన వారికి ఆటోగ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. దాంతో, ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. సూర్య మైదానం లోపల, బయట మనసులు గెలుస్తున్నాడని క్యాప్షన్ ఇచ్చింది.