నెట్ ఫ్లిక్స్ లో 'మీటర్' మూవీ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
- కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన 'మీటర్'
- కథానాయికగా అతుల్య రవి పరిచయం
- థియేటర్స్ లో ఆశించినస్థాయిని అందుకోలేకపోయిన సినిమా
- నెట్ ఫ్లిక్స్ లో మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్
ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. పోలీస్ కానిస్టేబుల్ గా తన తండ్రికి ఎదురవుతూ వచ్చిన అవమానాలను చూస్తూ పెరిగిన హీరో, ఆ జాబు మాత్రం చేయకూడదని నిర్ణయించుకుంటాడు. కాలం కలిసొచ్చి ఆ జాబ్ వస్తే కూడా మానేయాలని అనుకుంటాడు. అలాంటి అతను పోలీస్ జాబ్ లోనే ఉండిపోవాలనేంతగా మార్చిన సంఘటన ఏది? అనేదే కథ.
అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. అలాంటి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. మరి ఓటీటీ ద్వారా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందనేది చూడాలి.