ముంబయిలో జోరుగా పవన్ కల్యాణ్ 'ఓజీ' షూటింగ్
- సుజీత్ దర్శకత్వంలో పవన్ కొత్త చిత్రం ఓజీ
- ఇటీవలే ముంబయిలో షూటింగ్ ప్రారంభం
- తాజాగా ప్రకాశ్ రాజ్ పై సన్నివేశాల చిత్రీకరణ
- ఈ ఏడాది ఆఖరుకు ఓజీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం
ముంబయి షెడ్యూల్ ముగిసిన అనంతరం పుణేలో మరో షెడ్యూల్ జరగనున్నట్టు తెలుస్తోంది. సినిమాలోని ముఖ్యమైన నటులందరూ ఈ షెడ్యూల్ లో షూటింగ్ కు హాజరవుతారని సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఓజీలో పవన్ కల్యాణ్ సరసన తమిళమ్మాయి ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
కాగా, డిసెంబరు నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అఫీషియల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఓజీ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.