రేపే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..!
- అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం
- ఈ నెల 28న విడుదల కానున్న కొత్త సినిమా
- రేపు వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
ఇప్పటికే అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రమోషన్స్ జోరు పెంచారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. వేదికగా వరంగల్ ను ఎంచుకుంది. వరంగల్ లోని రంగలీల మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొనే అవకాశం ఉంది.