ఆదిపురుష్ నుంచి అక్షయ తృతీయ కానుక.. జై శ్రీరామ్ పాట వచ్చేసింది
- రెబల్ స్టార్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో సినిమా
- శ్రీరాముడి పాత్రలో నటించిన ప్రభాస్
- జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
తెలుగులో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ‘మా బలమేదంటే మీపై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే... మహిమాన్విత మంత్రం నీ నామమే అంటూ’ శ్రీరాముడిని కీర్తిస్తూ సాగిన పాట ఆకట్టుకునేలా ఉంది. చెడుపై మంచి సాధించిన గొప్ప విజయానికి ప్రతీకగా దర్శకుడు ఓంరౌత్ ఈ సినిమాను తెరకెక్కించారు. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు.