చరణ్ కి హిట్ ఇచ్చిన దర్శకుడితో సాయితేజ్!
- అనుకోకుండా సాయితేజ్ కి వచ్చిన గ్యాప్
- ఇక పై వరుస సినిమాలు చేయాలనే ఆలోచన
- వరుసగా కథలు వింటున్న సాయితేజ్
- సంపత్ నందికి ఛాన్స్ ఇచ్చినట్టుగా టాక్
ఈ నేపథ్యంలోనే సంపత్ నంది ఆయనకి ఒక కథను వినిపించాడనీ, ఇంతవరకూ తాను చేసిన సినిమాలకు ఈ కథ భిన్నంగా ఉండటంతో, సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నాడని చెబుతున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు.
ఇంతవరవరకూ సంపత్ నంది చేసిన సినిమాల్లో 'రచ్చ ' .. 'బెంగాల్ టైగర్' భారీవిజయాలను అందుకున్నాయి. మాస్ యాక్షన్ సినిమాలను ఆయన బాగా తీయగలడనే పేరు తెచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఆయనకి సరైన హిట్ పడలేదు. సాయితేజ్ తో చేసే సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన ఉన్నాడని చెబుతున్నారు.