జగదీశ్ షెట్టర్ రాజీనామాపై స్పందించిన బొమ్మై
- పార్టీ పెద్ద పదవి ఆఫర్ చేసినా తిరస్కరించారని వెల్లడి
- షెట్టర్ రాజీనామా బాధించిందన్న కర్ణాటక ముఖ్యమంత్రి
- బీజేపీలోనే ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డ బొమ్మై
వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో జగదీశ్ షెట్టర్ బీజేపీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆదివారం తన పదవికి, బీజేపీ సభ్యత్వానికీ రాజీనామా చేసిన షెట్టర్.. ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్ణాటకలో బీజేపీ బలోపేతానికి తాను చేసిన కృషిని పార్టీ హైకమాండ్ విస్మరించిందని షెట్టర్ ఆరోపించారు. పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించడంతో గత్యంతరం లేక పార్టీని వీడానని చెప్పారు. పార్టీ నిర్ణయంతో తన మనసు విరిగి పోయిందని, ఒకవేళ టికెట్ ఇస్తామని చెప్పినా తన నిర్ణయంలో మార్పు ఉండేది కాదని జగదీశ్ షెట్టర్ తేల్చిచెప్పారు.