అంచనాలు పెంచేస్తున్న 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్' ట్రైలర్!
- సల్మాన్ తాజా చిత్రంగా 'కిసీ కా భాయ్ .. కి సీ కి జాన్'
- ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన భారీ సినిమా ఇది
- పవర్ఫుల్ రోల్ పోషించిన జగపతిబాబు
- 'ఈద్' కానుకగా ఈ నెల 21న సినిమా విడుదల
ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. సల్మాన్ .. వెంకీ .. జగపతిబాబు పాత్రలను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ను వదిలారు.
ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు విజృంభించినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. చూస్తుంటే పూజ హెగ్డే పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ ద్వారా చాలా కథను చెప్పే ప్రయత్నం చేశారు. పూజ చేతిలోని ఓ అలంకరణ వస్తువు సల్మాన్ చేయితగిలి పడిపోయి పగిలిపోతుంది. 'అయ్యో అది నాలుగొందల సంవత్సరాల క్రితం నాటిది' అంటూ బాధ పడుతుంది పూజ. 'పోన్లే నేను ఇంకా కొత్తదేమో అనుకున్నాను' అంటూ సల్మాన్ కూల్ గా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలైట్.