పుష్ప-2 నుంచి గ్లింప్స్ రిలీజ్... వీడియో మామూలుగా లేదు!
- బన్నీ, సుకుమార్ కాంబోలో పుష్ప బ్లాక్ బస్టర్ హిట్
- అదే కలయికలో పుష్ప-2
- రోమాంఛక సన్నివేశాలతో సీక్వెల్
- గ్లింప్స్ వీడియోతో సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసిన సుకుమార్
ఇప్పుడు ఇదే కాంబోలో 'పుష్ప-2 ద రూల్' వస్తోంది. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా పుష్ప-2 చిత్రబృందం గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది. తొలి పార్ట్ ను మించిన డ్రామా ఈ సీక్వెల్ లో ఉన్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప ఆచూకీ లేకపోవడంతో, పుష్ప ఎక్కడ అంటూ చర్చించుకోవడంతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. పుష్ప అసలున్నాడా? పోలీసులు అతడి శవాన్ని మాయం చేశారా? అనే సందేహాలు వెలువడతాయి. పుష్ప-2 ఎంత రసవత్తరంగా ఉండబోతోందో సుకుమార్ ఈ గ్లింప్స్ తో దాదాపుగా హింట్ ఇచ్చేశాడు.
ఈ వీడియోలోని ప్రతి సన్నివేశం పుష్ప హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా ఉండడం గమనించవచ్చు. చివర్లో పెద్దపులి పక్కనుంచి బన్నీ నడిచే సీన్ హైలైట్ గా నిలిచింది. ఇంకెందుకాలస్యం ఈ గ్లింప్స్ వీడియో మీరు కూడా చూసేయండి.