ఐపీఎల్ 2023 కప్పు కొట్టేదెవరో చెప్పిన డీ విలియర్స్
- ఈ ఏడాదీ గుజరాత్ టైటాన్స్ దే తుది విజయమన్న డీ విలియర్స్
- గతంలో తాను చెప్పిన దానికే కట్టుబడి ఉంటానని ప్రకటన
- మంచి సమతూకంతో కూడిన గొప్ప జట్టుగా అభివర్ణన
‘‘చాలా కాలం క్రితం ఐపీఎల్ వేలం సమయంలోనే గుజరాత్ జట్టు విజేతగా నిలుస్తుందని చెప్పా. ఆర్సీబీ గెలవాలని నాకు ఉన్నప్పటికీ, గతంలో చెప్పిన దానికే నేను కట్టుబడి ఉంటా. ఆ జట్టు (గుజరాత్) గొప్పది. ఎంతో సమతూకంతో ఉంది. వారి దగ్గర కావాల్సినన్ని సామర్థ్యాలు ఉన్నాయి’’ అని డీ విలియర్స్ అన్నాడు. విరాట్ కోహ్లీలో పెద్ద మార్పు తానేమీ చూడడం లేదంటూ, అతడి టెక్నిక్ ఇప్పటికీ బలంగా ఉందన్నాడు.