నా రెండో సినిమా కూడా దిల్ రాజుతోనే: బలగం వేణు
- మున్నా సినిమాతో హాస్య నటుడిగా టాలీవుడ్ కు పరిచయమైన వేణు
- బలగం చిత్రంతో దర్శకుడిగా ఘన విజయం సొంతం
- తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా చూపెట్టిన వేణు
ఈ భారీ హిట్ తర్వాత వేణు తదుపరి సినిమాపై గురించి అప్పుడే చర్చ మొదలైంది. దీనిపై స్పందించిన వేణు తన రెండో సినిమా కచ్చితంగా దిల్ రాజు బ్యానర్ లోనే ఉంటుందని స్పష్టం చేశాడు. ఇప్పటికే రాజుకు ఓ కథ కూడా చెప్పానని తెలిపాడు. దానికి దిల్ రాజు కొన్ని సూచనలు చేశారన్నాడు. అవి తనకు కొత్త కిక్ ఇచ్చాయని తెలిపాడు. రాజు సూచనలకు అనుగుణంగా కథను తీర్చిదిద్దుతానని చెప్పాడు. ప్రస్తుతం బలగం సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన వేణు నటుడిగానూ కొనసాగుతానని స్పష్టం చేశాడు.