జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు
- ఈ నలుగురిని సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్
- పూర్తి ఆధారాలతోనే సస్పెండ్ చేశామన్న మిథున్ రెడ్డి
చంద్రబాబుకు నైతిక విలువలు లేవని... గతంలో అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ ను ఎలా దించేశారో అందరికీ తెలుసని అన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఈ ఎమ్మెల్యేలు అడిగారని... మీకు సీటు ఇవ్వలేనని జగన్ నిజాయతీగా చెప్పారని... ఒక ఎమ్మెల్సీ సీటు పోయినా సరే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని కొనియాడారు.