అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'మీటర్' సాంగ్ రిలీజ్!
- కిరణ్ అబ్బవరం హీరోగా 'మీటర్'
- కథానాయికగా అతుల్య రవి పరిచయం
- సంగీతాన్ని అందించిన సాయి కార్తీక్
- ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా విడుదల
మైత్రీ - క్లాప్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును వదిలారు. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ' ఓ బేబీ జారిపోమాకే' అంటూ ఈ పాట సాగుతోంది.
సాయికార్తీక్ స్వరపరిచిన ఈ పాటకి బాలాజీ సాహిత్యాన్ని అందించగా, ధనుంజయ్ ఆలపించాడు. ఈ సినిమాతో కథానాయికగా అతుల్య రవి పరిచయమవుతోంది. 2017లో కథానాయికగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి, తెలుగులో ఇదే ఫస్టు మూవీ. ఏప్రిల్ 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.