'రాజ్ కహాని' ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
- రాజ్ కార్తికేన్ హీరోగా రూపొందిన 'రాజ్ కహాని'
- కథానాయికగా చంద్రిక అవస్తి పరిచయం
- సంగీతాన్ని అందించిన మహిత్ నారాయణ్
- ఈ నెల 24వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఈ సినిమాలో చంద్రిక అవస్తి, సోనియా సాహా .. ప్రియా పాల్ .. సాయి .. జబర్దస్త్ ఫణి తదితరులు నటించారు. మార్చి 24న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు వైవీఎస్ చౌదరి, నిర్మాత సురేష్ కొండేటి ముఖ్య అతిథులుగా వచ్చారు. ట్రైలర్ బాగుందని చెబుతూ చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ట్రైలర్ చూస్తే కామెడీ, ఎమోషన్ సమపాళ్లలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. 'రాజ్ కహాని' సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వబోతోన్నట్టుగా ట్రైలర్ చెబుతోంది. ట్రైలర్‌లో ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాకి మహిత్ నారాయణ్ అందించిన సంగీతం ప్లస్ అవుతుంది. యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఆయన విజువల్స్ ట్రైలర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. ఈ సినిమాను మార్చి 24న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.