ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్న నిహారిక, చైతన్య.. అసలేం జరుగుతోంది?
- ప్రేమించుకుని మూడేళ్ల కింద పెళ్లితో ఒక్కటైన యువ జంట
- కొన్నాళ్లుగా ఇద్దరికీ పడటం లేదని పుకార్లు
- ఇన్ స్టా పెళ్లి ఫొటోలనూ తొలగించిన చైతన్య!
ఈ క్రమంలో నిహారిక, చైతన్య చేసిన పని ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్టయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఇద్దరూ ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఇన్ స్టా లో చైతన్య తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా తొలగించినట్టు తెలుస్తోంది. దీంతో, ఇద్దరి మధ్య విభేదాలు నిజమే అన్న ప్రచారం ఊపందుకుంది.