నాగశౌర్య మూవీ నుంచి హుషారైన పెప్పీ నెంబర్!
- అవసరాల నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీ
- నాగశౌర్య సరసన నాయికగా మాళవిక నాయర్
- సంగీతాన్ని అందించిన కల్యాణి మాలిక్
- ఈ నెల 17వ తేదీన సినిమా రిలీజ్
ఈ నెల 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన ఈ పాటకి కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, బెన్ హుమన్ .. విష్ణుప్రియ రవి ఆలపించారు. యూత్ ను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసిన పెప్పీ నంబర్ ఇది.
విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించాడు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నాగశౌర్యకి ఈ సినిమా ఊరటనిస్తుందేమో చూడాలి. ఇక మాళవిక నాయర్ కూడా సరైనా బ్రేక్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తోంది.