ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌కు మాతృవియోగం
- ముంబైలోని స్వగృహంలో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచిన స్నేహలత దీక్షిత్
- తల్లి మరణవార్తను వెల్లడించిన మాధురి దీక్షిత్ దంపతులు
- నేడు వర్లీలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు
కాగా, గతేడాది తన తల్లి 90వ పుట్టిన రోజు సందర్భంగా మాధురి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కుమార్తెలకు తల్లికి మించిని ఆప్తమిత్రులు లేరని వ్యాఖ్యానించారు. తనకు జీవితంలో ఎన్నో విషయాలు నేర్పించిన తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఆమెకు సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.