ఈ నెల 22న ధమ్కీ ఇచ్చేందుకు విష్వక్సేన్ రెడీ
- స్వీయ దర్శకత్వంలో దాస్ కా ధమ్కీ చిత్రంలో నటించిన విష్వక్సేన్
- చిత్రం విడుదల తేదీని వెల్లడిస్తూ కొత్త పోస్టర్
- హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్
కామెడీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.