ఏపీ గాడిలో పడాలంటే మళ్లీ చంద్రబాబు రావాలి: నారా రోహిత్
- సత్తెనపల్లిలో ఎన్టీఆర్, కోడెల విగ్రహాలను ఆవిష్కరించిన రోహిత్
- కోడెల మన మధ్య లేకపోవడం బాధాకరమని వ్యాఖ్య
- వచ్చే ఎన్నికల్లో కోడెల శివరామ్ విజయం సాధిస్తారని ధీమా
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ, 2019లో తాను సత్తెనపల్లికి వచ్చానని.... కోడెల శివప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించానని చెప్పారు. ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని... ఎన్టీఆర్ కి, కోడెల శివప్రసాద్ కి మరణం అన్నది లేదని... వీరు టీడీపీ జెండాలో, కార్యకర్తల గుండెల్లో నిలిచే ఉంటారని అన్నారు. అందరి ఆశీర్వాదాలతో కోడెల శివరామ్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.