మా పిల్లలను ఇలాగే పెంచుతాం: ఉపాసన
- తాను గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వెనుక తల్లిదండ్రుల కష్టం ఉందన్న ఉపాసన
- వారి కష్టం తనకు తెలుసని వ్యాఖ్య
- తమ పిల్లలను కష్టం తెలిసేలా పెంచుతామన్న ఉపాసన
తాను ఇంటి వద్ద ఖాళీగా కూర్చోనని... తన పుట్టుకకు కూడా ఒక కారణం ఉందని తాను నమ్ముతానని అన్నారు. గొప్ప కుటుంబంలో పుట్టి ఉండి కూడా చుట్టూ ఉన్న ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించకపోతే తన జీవితానికి అర్థం ఉండదని చెప్పారు, తన గురించి నెగెటివ్ వార్తలను ప్రచారం చేయవద్దని కోరారు. మరోవైపు ఉపాసన గర్భవతి అనే విషయం తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.