అమెరికా, చైనా మధ్య చిచ్చురేపిన ‘బెలూన్’.. అసలేం జరిగిందంటే..
- తమ భూభాగంలోకి వచ్చిన బెలూన్ ను పేల్చివేసిన అగ్రరాజ్యం
- అది చైనా పంపిన నిఘా బెలూన్ గా భావిస్తున్న అమెరికా
- వాతావరణాన్ని అధ్యయనం చేసే బెలూన్ అంటున్న చైనా
- దాన్ని కూల్చినందుకు తగిన సమాధానం చెబుతామని హెచ్చరిక
సముద్ర జలాల్లో పడిపోయిన బెలూన్ శిథిలాలను వీలైనంత మేర సేకరించేందుకు ఓ ఓడను కూడా అమెరికా పంపింది. ‘బుధవారం, నాకు బెలూన్ గురించి వివరించినప్పుడు, వీలైనంత త్వరగా దాన్ని కాల్చివేయమని ఆదేశించాను. పేల్చివేత వల్ల భూమిపై ఎవరికీ నష్టం జరగకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. సముద్రం మీదకు వెళ్లినప్పుడు పేల్చివేయాలని నిర్ణయించారు. దాన్ని విజయవంతంగా తొలగించారు. ఆ ఆపరేషన్ చేసిన మా ఏవియేటర్లను అభినందిస్తున్నా’ అని బైడెన్ పేర్కొన్నారు.
ఉత్తర అమెరికాలోని ప్రధానమైన సైనిక స్థావరాల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఈ స్పై బెలూన్‍ను చైనా పంపిందని అమెరికా అనుమానించింది. దీంతో అమెరికా, చైనా మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. కాగా, వాతావరణంపై అధ్యయనం చేసేందుకే బెలూన్ ను పంపించామని చైనా అంటోంది. దాన్ని అమెరికా కూల్చివేయడం పట్ల చైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ నుంచి కూడా సరైన ప్రతిస్పందన ఉంటుందని పేర్కొంది. అది సివిలియన్ ఎయిర్ షిప్ అని ప్రకటించింది. అనుకోకుండా అది దారి మార్చుకొని అమెరికా వైపునకు వెళ్లిందని చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.