కేంద్ర బడ్జెట్ లో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఎలాంటి హామీ లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
- రైల్వే కారిడార్ గురించి ప్రస్తావించలేదని మిథున్ రెడ్డి విమర్శ
- ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వడం మంచి పరిణామమని వ్యాఖ్య
- విభజన హామీలను అమలు చేయాలని పట్టుబడతామన్న ఎంపీ
విభజన హామీల విషయంలో కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావన లేదని విమర్శించారు. రైల్వే కారిడార్ గురించి ప్రస్తావించలేదని అన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ బడ్జెట్ సమావేశాల్లో పట్టుబడతామని చెప్పారు. అయితే, ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై రాయితీ ఇవ్వడం మంచి పరిణామమని అన్నారు.