'బుట్టబొమ్మ' రిలీజ్ వాయిదా .. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- సరికొత్త ప్రేమకథగా 'బుట్టబొమ్మ'
- తెలుగు తెరకి అనిఖ సురేంద్రన్ పరిచయం
- ప్రతినాయకుడిగా అర్జున్ దాస్
- వచ్చేనెల 4వ తేదీన సినిమా రిలీజ్
సూర్య వశిష్ఠ - అనిఖ సురేంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో విలన్ గా అర్జున్ దాస్ కనిపించనున్నాడు. ఇది ఒక పల్లెటూరి ప్రేమకథ .. తమ ప్రేమను బ్రతికించడం కోసం పోరాడే జంట కథ అనే విషయం ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైపోయింది. అనిఖ సురేంద్రన్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.
ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా టీమ్ రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. వచ్చేనెల 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. ఈ టీనేజ్ లవ్ స్టోరీ యూత్ కి ఎంతవరకూ కనెక్ట్ అవుతుందనేది చూడాలి.