నాని ‘దసరా’ ఓటీటీ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
- షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం
- నాని సరసన హీరోయిన్ గా కీర్తి సురేశ్
- మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ‘దసరా’ ప్రపంచవ్యాప్తంగా మార్చి 30వ తేదీన విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్ ముగిసిన తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ శనివారం ప్రకటించింది. ఈ మేరకు దసరా పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేసింది.