RRR: ఆర్ఆర్ఆర్, పుట్టబోయే బిడ్డ గురించి ఉపాసన ఆసక్తికర ట్వీట్

Iam sooo happy my baby can experience this along with me says upasana

  • గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి చరణ్ తో కలిసి వెళ్లిన ఉపాసన
  • ఆర్ఆర్ఆర్ ప్రయాణంలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని ట్వీట్
  • పుట్టబోయే బిడ్డకూ ఈ అనుభూతి దక్కిందన్న ఉపాసన

ఆర్ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. లాస్ ఏంజెల్స్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డు అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ సతీసమేతంగా ప్రదానోత్సవానికి వెళ్లారు. నాటునాటు పాటకు అవార్డు దక్కడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలియజేశారు.

 ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డు లభించడం, ఈ చారిత్రక సందర్భంలో కడుపులో బిడ్డ సహా తాను పాలు పంచుకోవడంపై ఆమె స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్ కుటుంబంలో నేనూ భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది దేశం గర్వించే విజయం. ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామిని చేసిన రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళికి ధన్యవాదాలు. నాతో కలిసి నా బేబీ (పుట్టబోయే బిడ్డ) కూడా ఈ అనుభూతిని పొందుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. చాలా ఉద్వేగంగా కూడా ఉంది’ అని ఉపాసన ట్వీట్ చేశారు. అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో చిత్ర బృందంతో దిగిన ఫొటోలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు.

  • Loading...

More Telugu News