విమర్శలు చేసేముందు జీవోను క్షుణ్ణంగా చదవండి: బొత్స సత్యనారాయణ
- జీవో నెంబర్ వన్ పై విమర్శలు గుప్పిస్తున్న విపక్షాలు
- అసలు జీవోను చదివారా? అని బొత్స ప్రశ్న
- రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని వ్యాఖ్య
రోడ్ షోలు, ర్యాలీలపై నిషేధం ఎక్కడుందో విమర్శకులు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్లపై బహిరంగసభలు పెట్టొద్దని మాత్రమే జీవోలో ఉందని చెప్పారు. ఈ జీవో అన్ని పార్టీలకు వర్తిస్తుందని తెలిపారు. అవసరమైతే అనుమతి తీసుకుని బహిరంగసభలు పెట్టుకోవచ్చని చెప్పారు. వైఎస్సార్, జగన్ చేపట్టిన పాదయాత్రల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రజల పట్ల అన్ని పార్టీలు బాధ్యతలను తీసుకోవాలని అన్నారు.