నాగ చైతన్య ‘కస్టడీ’ విడుదల తేదీ ఖరారు
- వచ్చే ఏడాది మే 12న విడుదల
- ప్రకటించిన చిత్ర నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
- కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్న నాగచైతన్య
యాక్షన్ కథాంశంగా 'కస్టడీ' తెరకెక్కుతోంది. నాగచైతన్య గత చిత్రాలకు భిన్నంగా ఇది ఉంటుంది. వెంకట్ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. కానిస్టేబుల్ పాత్రతో నాగ్ తన నటనలో కొత్త కోణాన్ని చూపించబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను గత నెలలోనే నాగచైతన్య 36వ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాణ సంస్థ విడుదల చేయడం తెలిసిందే. కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.