'పొన్నియిన్ సెల్వన్ 2' రిలీజ్ డేట్ ఇదే!
- లైకా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్'
- తమిళనాట రికార్డుస్థాయి వసూళ్లను నమోదు చేసిన సినిమా
- సెకండ్ పార్టు కోసం అంతా వెయిటింగ్
- వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటన
ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన ఈ సినిమా విడుదలైంది. తెలుగులో అంతగా కనెక్ట్ కాకపోయినా, తమిళంలో మాత్రం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సెకండ్ పార్టు ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీమ్ రెండో భాగానికి సంబంధించిన రిలీజ్ డేట్ ను ప్రకటించింది. 2023 .. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఫస్టు పార్టు ముగిసిన దగ్గర నుంచే సెకండ్ పార్టు మొదలుకానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.