రవి బాబుకు కాల్ చేసి భావోద్వేగానికి గురైన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో
- లే బాబాయ్ లే అంటూ పిలిచిన తారక్
- అకాల మరణం ఎంతగానో కలచివేసిందని ట్వీట్
- ఆయన మరణం తమకు తీరని లోటు అంటూ ఆవేదన
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలోనూ సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు. ‘‘చలపతి రావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుంచి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన చలపతి రావు గారి మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్ధన’’ అని తారక్ ట్వీట్ చేశాడు.