Ramcharan: బేబీ బంప్ తో రాంచరణ్ భార్య ఉపాసన.. ఫొటోలు వైరల్

Photos of Upasana Ramcharan with baby bump going viral

  • త్వరలో తండ్రి కాబోతున్న రాంచరణ్
  • ఉపాసన కజిన్ పెళ్లి కోసం థాయ్ లాండ్ వెళ్లిన చరణ్ దంపతులు
  • ఫొటోలలో బేబీ బంప్ తో కనిపిస్తున్న ఉపాసన

టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. తాగాగా ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్ లాండ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలలో ఉపాసన బేబీ బంప్ తో కనిపిస్తోంది. ఈ పిక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఫొటోలలో ఉపాసన తల్లిదండ్రులు కూడా కనిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News