తనకు పెళ్లి అయిపోయిందనే వార్తలపై అంజలి స్పందన
- అంజలి పెళ్లి చేసుకుందంటూ కొంత కాలంగా ప్రచారం
- ఈ వార్తల్లో నిజం లేదన్న అంజలి
- ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని వ్యాఖ్య
ఈ క్రమంలో తాజాగా అంజలి పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ... తనకు ఇప్పటికే పెళ్లి అయిపోయిందని, తాను అమెరికాలో నివాసం ఉంటున్నట్టు రకరకాలుగా ప్రచారం జరుగుతోందని... ఆ ప్రచారంలో నిజం లేదని చెప్పింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు లేదని తెలిపింది. తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని... సమయం వచ్చినప్పుడు తన వివాహం జరుగుతుందని చెప్పింది.