జగన్‌ను ఓడించేందుకు పెద్ద కుట్ర జరుగుతోంది: బొత్స
- విజయనగరంలో వైసీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం
- విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీర్మానం
- ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖ పరిపాలన రాజధాని అన్న వైవీ
వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని అంటున్నారని సుబ్బారెడ్డి తెలిపారు. అయితే, అమరావతిలో కొన్న భూముల ధరలు పడిపోతాయన్న భయంతో, వారి సామాజిక వర్గ అభివృద్ధి కోసం కొందరు అక్కడే రాజధాని కావాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని తీర్మానించారు.