తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సీనియర్ హీరో
- రెండు రోజులుగా అతిసార వ్యాధితో బాధపడుతున్న శరత్ కుమార్
- చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న నటుడు
- ఆయన వెంట ఉన్న భార్య రాధిక, కూతురు వరలక్ష్మి
శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై ఈరోజు ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందని తమిళ మీడియా చెబుతోంది. శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా శరత్‌కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పటికే దక్షిణాది భాషల్లో 130కి పైగా చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించారు.