టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నాయన్న రేవంత్
- డ్రామారావు దత్తత తీసుకోవడం వల్లే కొడంగల్ కు ఈ పరిస్థితని విమర్శ
- కొడంగల్ కు నిధులు వచ్చేంత వరకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరాహారదీక్ష చేయాలని డిమాండ్
కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పన్నాయని రేవంత్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను గాంధీ కుటుంబం గౌరవించిందని... కానీ బీజేపీ, టీఆర్ఎస్ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కేవలం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో తప్ప మరే ప్రాజెక్టుతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధం లేదని అన్నారు. మిగిలిన ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో జరిగినవే అని చెప్పారు.