'నేను స్టూడెంట్ సర్' సాంగ్ ప్రోమో రిలీజ్!
- బెల్లంకొండ గణేశ్ హీరోగా 'నేను స్టూడెంట్ సర్'
- కథానాయికగా అవంతిక పరిచయం
- సంగీత దర్శకత్వం వహించిన మహతి స్వరసాగర్
- డిసెంబర్ 1వ తేదీన పూర్తి పాట రిలీజ్
ఆ తరువాత సినిమాగా ఆయన 'నేను స్టూడెంట్ సర్' చేశాడు. 'నాంది' సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా 'అవంతిక' పరిచయమవుతోంది. ఆమె సీనియర్ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు.
మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను వదిలారు. 'మాయే మాయే అంతా మాయే .. నిన్నే చూడకపోతే కళ్లే తిడుతున్నాయే' అంటూ ఈ పాట సాగుతోంది. పూర్తి పాటను డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు.