ఆసుపత్రిలో చేరిన కమలహాసన్.. అభిమానుల ఆందోళన
- నిన్ననే హైదరాబాద్ వచ్చి విశ్వనాథ్‌ను కలిసిన కమల్
- రాత్రికి చెన్నై చేరుకోగానే ఆసుపత్రిలో చేరిక
- జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు
- రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచన
జ్వరంతో అస్వస్థతగా ఉండడంతో కమల్ శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ (ఎస్ఆర్ఎంసీ)లో చేరినట్టు తెలుస్తోంది. అయితే, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ రోజు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
ఇటీవల విడుదలైన కమలహాసన్ సినిమా విక్రమ్ సంచలన విజయం సాధించింది. కమల్ ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ సీజన్-6తో పాటు, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్-2 (భారతీయుడు-2) షూటింగుతో బిజీగా ఉన్నారు. ఇండియన్-2 షూటింగ్ పూర్తయిన వెంటనే మరో ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తున్న ‘కేహెచ్ 234’ షూటింగ్‌లో జాయిన్ అవుతారు. దర్శకుడు పీఏ రంజిత్‌తోనూ ఓ సినిమా చేస్తున్నారు.