ఏలూరు ధనా బ్యాంక్ చైర్మన్ సహా 21 మందికి పదేళ్ల జైలు శిక్ష
- డిపాజిటర్ల సొమ్ము రూ. 3 కోట్లను స్వాహా చేసిన బ్యాంకు
- 2007లో బ్యాంక్ చైర్మన్ సహా 27 మందిపై కేసు
- ఇంకా పరారీలోనే బ్యాంకు చైర్మన్
2013 నుంచి ఈ కేసులో విచారణ మొదలైంది. తాజాగా, నిందితులను దోషులుగా తేల్చిన ఏలూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి చింతలపూడి పురుషోత్తం కుమార్ తీర్పు వెల్లడించారు. దోషులు 21 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయస్థానం, వారిలో కొందరికి రూ. 10 వేలు, మరికొందరికి రూ. 5 వేలు చొప్పున జరిమానా కూడా విధించింది.