'ఆదిపురుష్' విడుదల తేదీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- వచ్చే జనవరి 12న విడుదల కావాల్సిన ఆదిపురుష్
- వచ్చేే ఏడాది జూన్ 16కి విడుదల వాయిదా
- వీఎఫ్ఎక్స్ షాట్లను సరి చేసే పనిలో చిత్ర యూనిట్
- టెక్నీషియన్లకు మరికొంత సమయం ఇవ్వాల్సి ఉందన్న ఓం రౌత్
''ఆదిపురుష్' అనేది కేవలం సినిమానే కాదు. శ్రీరామచంద్ర ప్రభువుపై మనకున్న భక్తి... మన చరిత్ర, సంస్కృతిపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో విజువల్ ట్రీట్ ఇవ్వడం కోసం... ఈ సినిమా కోసం పని చేస్తున్న టీములకు మరికొంత సమయం ఇవ్వాల్సి వస్తోంది. వచ్చే ఏడాది జూన్ 16న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది' అని ట్వీట్ చేశారు.
ఈ చిత్రం కోసం ఇప్పటికే దాదాపు రూ. 300 కోట్లను వెచ్చించినట్టు సమాచారం. ఇప్పుడు మరో రూ. 100 కోట్లతో వీఎఫ్ఎక్స్ షాట్స్ ను సరి చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.