శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుప రాడ్డుకట్టిన దుండగులు
- హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్
- నల్లపాడు-గుంటూరు సెక్షన్‌లో పట్టాలపై ఇనుపరాడ్డును కట్టిన దుండగులు
- లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు. దుండగులు పథకం ప్రకారమే దానిని కట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. రైలు పట్టాలపై గస్తీ నిర్వహించే సిబ్బంది తనఖీ చేసుకుంటూ వెళ్లిన అనంతరం వారు ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు.