యాదాద్రిలోనూ ప్రారంభమైన తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు
- ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు
- కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు
- సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 2,83,200 ఆదాయం
- చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత
కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా యాదాద్రి నిన్న భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. వీటి ద్వారా రూ. 2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కాగా, సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న యాదాద్రిలోని ప్రధాన, అనుబంధ ఆలయాలను మూసివేయనున్నారు. ఆ రోజున ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ద్వారబంధనం జరుగుతుందని ఈవో గీత తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు వీడుతుంది.