నయనతార సరోగసీ చట్టబద్ధమే... తేల్చేసిన విచారణ కమిటీ
- 2016 మార్చి 11న నయన్ పెళ్లి జరిగిందన్న కమిటీ
- 2021 ఆగస్టులో సరోగసీ ప్రక్రియ మొదలైందని వెల్లడి
- 2021 నవంబర్ లో అగ్రిమెంట్ చేసుకున్నారని వివరణ
- చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలోనే సరోగసి జరిగిందన్న విచారణ కమిటీ
2016 మార్చి 11న విఘ్నేశ్ శివన్ ను నయనతార పెళ్లి చేసుకున్నట్లు ఆ దంపతులు అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా కమిటీ తెలిపింది. ఈ క్రమంలో సరోగసీ కోసం నయన్ దంపతులు 2021 ఆగస్టులో ప్రక్రియను మొదలుపెట్టారని, ఇక నిబంధనల మేరకు అదే ఏడాది నవంబర్ లో వారు సరోగసీ కోసం ఒప్పందం కూడా చేసుకున్నారని వెల్లడించింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలోనే నయన్ దంపతులు సరోగసీ ద్వారా పిల్లలను కన్నారని కూడా కమిటీ తేల్చిచెప్పింది.