ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్ భేటీ.. త్వరలోనే టీఆర్ఎస్‌లోకి!
- చేనేత రంగ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని అభినందించిన రాపోలు
- చేనేత రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేసిందని ఆరోపించిన మాజీ ఎంపీ
- త్వరలోనే బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరే అవకాశం
చేనేత కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ విషయంలో బీజేపీ చేస్తున్న నిర్వాకాన్ని చూడలేకపోతున్నానని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరాలన్న తన కోరికను కేసీఆర్ వద్ద రాపోలు బయటపెట్టినట్టు సమాచారం. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని రాపోలు ఆకాంక్షించారు.