బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
- ఇటీవలే టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నర్సయ్య గౌడ్
- తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన వైనం
- సబ్ కా సాత్... సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ స్ఫూర్తితో పనిచేస్తానని వెల్లడి
ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిష్పక్షపాతంగా పనిచేయడమే తన ప్రధాన కర్తవ్యమని ఆయన చెప్పారు. తాను ఎంపీగా పనిచేసిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పనులను భువనగిరికి తీసుకువచ్చానని చెప్పారు. సబ్ కా సాత్... సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళతానని ఆయన తెలిపారు.