'ఊర్వశివో రాక్షసివో' నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్!
- అల్లు శిరీష్ తాజా చిత్రంగా రూపొందిన 'ఊర్వశివో రాక్షసివో'
- నాయిక పాత్రలో అనూ ఇమ్మాన్యుయేల్
- సంగీత దర్శకుడిగా అచ్చు రాజమణి
- దర్శకుడిగా రాకేశ్ శశి
అల్లు శిరీష్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగును వదిలారు. 'అనగా అనగనగా .. కనులే కలగనగా .. నిజమయ్యి మెరుపల్లే వాలేగా' అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్ ఒకరిని ఒకరు కలుసుకుంటూ .. తలచుకుంటూ పాడుకునే పాట ఇది.
పూర్ణాచారి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. యూత్ కి నచ్చే బీట్ లోనే ఈ పాట నడిచింది. చాలా గ్యాప్ తరువాత అల్లు శిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక వరుస ఫ్లాపులతో రేసులో వెనుకబడిన అనూ ఇమ్మాన్యుయేల్ కి కూడా ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఈ ఇద్దరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.